ETV Bharat / state

శ్రీకాకుళం వైపు విశాఖ వాసులు

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా సమీప గ్రామాల ప్రజలు శ్రీకాకుళం జిల్లాకు వెళ్తున్నారు. విశాఖ నుంచి కార్లలో ద్విచక్రవాహనాల్లో వెళ్తున్న వారిని పైడిభీమవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా అడ్డుకోవాల్సి వస్తోందని పోలీసులు చెబుతున్నారు. క్వారంటైన్‌లో ఉంటే పంపిస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో చేసేదిలేక విశాఖ వాసులు వెనుదిరిగి వస్తున్నారు.

శ్రీకాకుళం వైపు విశాఖ వాసులు
శ్రీకాకుళం వైపు విశాఖ వాసులు
author img

By

Published : May 8, 2020, 3:46 PM IST

నిన్న తెల్లవారుజామున నుంచి ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి పలు దఫాలుగా స్టైరీన్‌ గ్యాస్‌ లీక్‌ అవడంతో 12 మంది మృతిచెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అర్ధరాత్రి మరోసారి గ్యాస్‌ లీకైన వాసన రావడంతో విశాఖ వాసులు మరోసారి ఆందోళనకు గురయ్యారు. ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.