శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధి సంతకవిటి మండలం గుళ్ల సీతారామపురం గ్రామంలోని పురాతన సీతారాముల ఆలయం ఉంది. ఇక్కడ సీతారాములు దేవతామూర్తులకు.. వెండి కిరీటాలు, పట్టువస్త్రాలను విశాఖపట్నం శారదా పీఠాధిపతి శిష్య బృందం ఆధ్వర్యంలో ఆలయ పురోహితులు భోగాపురం ప్రసాద్ శర్మకు అందజేశారు. సీతారాముల ఆలయాన్ని స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా సందర్శించారు. అక్కడి పరిస్థితిని చూసిన స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆవేదనకు గురయ్యారు.
ఆలయ దుస్థితిని చూసిన శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి.. సీతారాముల విగ్రహాలకు విశాఖ శారద పీఠం తరపున.. వెండి కిరీటాలన బహూకరిస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు శ్రీరామనవమికి ముందుగానే వెండి కిరీటాలను.. ఆలయ పురోహితులకు అందజేశారు. శ్రీరామనవమి వేడుకల కోసం విశాఖ శ్రీ శారదాపీఠం తరపున పట్టువస్త్రాలను అందించారు.
ఇవీ చూడండి..