అమరావతి రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేటలో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనేదే ప్రజల ఆకాంక్ష అన్నారు.
ఇదీ చదవండి: ఉపాధి హామీ పనులను అడ్డుకున్న గ్రామస్థులు