శ్రీకాకుళంలో శారదా స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరుల పీఠార్చన వైభవంగా జరిగింది. పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన గొప్ప ఆస్తి భగవదారాధన అని... విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. అనంతరం ఎంహెచ్ స్కూల్ గ్రౌండ్స్ లో అనుగ్రహభాషణం చేశారు.
దైవ దర్శనం, ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన హైందవ సంస్కృతిని పరిరక్షించుకోలేమన్న ఆయన... ఆలయ సంపదను పరిరక్షించుకోవడం, నిత్యం దైవారాధనలో ఉండే అర్చకులను ఆదుకోవడం ద్వారా హైందవ ధర్మాన్ని కాపాడుకోగలమన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే గొండి లక్ష్మీదేవి, స్థానికులు.. పీఠార్చన తిలకించారు.
ఇవీ చూడండి: