'ప్లాస్టిక్ నిషేధించాలని అవగాహన ర్యాలీ' - latest news for no plastic rally in sklm
ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. 2020 కల్లా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించాలని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ రహదారిపై సుమారు 2000 మంది ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. 2020 లో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధిస్తేమని ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ వాడకం నిషేధానికి ప్రతి ఒక్కరు చేయి కలపాలని కోరారు. ర్యాలీలో వివిధ పాఠశాలలు స్వచ్ఛంద సంస్థలు మండల కేంద్రం ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు రంగస్థలం మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ నిషేధానికి ఉద్యమం చేయడం అభినందనీయమన్నారు.