లాక్‌డౌన్ దృష్ట్యా దేశంలో అర్ధాంతరంగా నిలిచిన జాతీయ రహదారుల పనులపై.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ రామచంద్రతో కలిసి మంత్రి కృష్ణదాస్ వీడియో కాన్ఫరెన్స్‌లో నితిన్ గడ్కరీతో మాట్లాడారు. గతంలో జరిగిన పనులకు.. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని ధర్మాన కోరారు. పనుల ప్రగతికి ఆ నిధులు దోహదపడతాయని మంత్రి కృష్ణదాస్ వివరించారు.
ఇవీ చదవండి: