ETV Bharat / state

యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్​డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం - యాస్ తుపాను ప్రభావం తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని.. ఎస్పీ అమిత్ బర్థార్ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్​డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

ndrf teams ready at cyclone affected areas

author img

By

Published : May 25, 2021, 7:46 PM IST

యాస్ తుపాన్ ప్రభావంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్థార్ ఆదేశించారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటి మండలం ఇద్దువనిపాలెం వంటి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను, ఎన్​డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించగా.. ఆ బృందాలు మంగళవారం ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి.

లైఫ్ జాకెట్స్, విద్యుత్​ రంపాలు, టార్చ్ లైటులు, డ్రాగన్ లైట్లు, పగ్గం తాళ్లు అత్యవసర సమయాల్లో వినియోగించే ఇతర సామగ్రితో ఎన్​డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలను, పశువులను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, రోడ్డు మార్గంలో చెట్లును తొలగించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా కవిటి పోలీసు స్టేషన్ లో వాహనాలు, జేసీబీలను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

మనుషులు మరిచినా...మేం మరువం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.