Gauthu Sirisha: రుషికొండ అంశంపై రేపు తెదేపా నేతలు నిరసనకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషను అడ్డుకున్నారు. వజ్రపుకొత్తూరు మండలం రాజాం పంచాయతీలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని వస్తున్న వారిని.. కాశీబుగ్గలోని అక్కుపల్లి రోడ్డు వద్ద పోలీసులు ఆపారు. పోలీసులకు, తెదేపా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆంధ్రాలో కాకుండా పాకిస్తాన్లో ఉన్నట్లు ఉందని, తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా ధర్నా విషయంలో ఆంక్షలు ఎందుకని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్ ప్రశ్నించారు. విశాఖ గర్జనకు భద్రత ఇచ్చి మరీ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం... రుషికొండలో నిర్మాణాలపై ఎందుకు గోప్యతగా వ్యవహరిస్తుందన్నారు. మూడున్నరేళ్లుగా ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.
ఇవీచదవండి: