ETV Bharat / state

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్ నివాస్

శ్రీకాకుళం జిల్లాలోని మెుదటి దశలో 319 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నివాస్ వెల్లడించారు. నేటి నుంచి ఎన్నికల సిబ్బందికి ఎన్నికలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. అవరసమైన ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభించాలని ఆదేశాలు అందినట్లు స్పష్టం చేశారు.

author img

By

Published : Jan 28, 2021, 8:33 AM IST

srikakulam
శ్రీకాకుళంలో ఎన్నికల ఏర్పాట్లు

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏర్పడిన చిక్కుముడులన్నీ వీడిపోయాయి. దీంతో యుద్ధప్రాతిపదికన జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సిద్ధమవుతోంది. అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బుధవారం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్​ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, ఎస్పీ అమిత్‌ బర్దార్‌ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ... ఎన్నికలు సజావుగా జరపాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభించాలని తమకు ఆదేశాలు అందినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న స్పష్టం చేశారు. తొలిదశలో 319 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మరోసారి పరిశీలన

గతేడాది మార్చిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉన్నా, కొవిడ్‌ విజృంభణ కారణంగా అసలు నోటిఫికేషనే విడుదల కాలేదు. అప్పటికే అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణే తరువాయి అనుకున్న తరుణంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లు, నామినేషన్‌ దరఖాస్తులు అప్పుడే దాదాపు అన్ని మండల కేంద్రాలకు చేరిపోయాయి. వాటిని మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

ఎన్నికల సిబ్బందికి శిక్షణ...

నామినేషన్ల స్వీకరణ, తదుపరి కార్యాచరణ, ఎన్నికల నిర్వహణకు పెద్దఎత్తున సిబ్బంది అవసరమవుతారు. ఎంపిక చేసిన సిబ్బందికి నేటి నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వారిలో వీలైనంత ఎక్కువ మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ శాఖల సిబ్బంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

నైతిక విలువలతో ఏకగ్రీవాలు..!

మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో జరిగిన ఉద్రిక్తతలు అందరికీ తెలిసిందే. అంతా ఇష్టపడితేనే ఏకగ్రీవాలు కావాలి గాని బలవంతపు ఏకగ్రీవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అధికారులు చెబుతున్నారు. సమావేశంలో పంచాయతీల ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. నైతికంగా ఉంటేనే వాటికి ఆమోదం తెలపాలన్నారు.

యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు..!

ఎన్నికల ప్రక్రియను వీడియో కెమెరాలో చిత్రీకరించడం లేదా వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా లైవ్‌ రికార్డింగ్‌ చేస్తారు. ఆ దృశ్యాలను నిర్ణీత కాలం భద్రంగా ఉంచుతారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా ఏ అభ్యర్థికీ ఇబ్బంది కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీడియో కెమెరాలు, వెబ్‌ కాస్టింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఏ దశలోనైనా ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారెవరైనా ఆ ఘటనను చిత్రాలు, వీడియోలు తీసి నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. దానికి ఓ ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దానిలో ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు వెంటనే ఆ ఘటనపై ఆరా తీసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రణాళికలు సిద్ధం: ఎస్పీ

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసేందుకు తీసుకొచ్చిన నామపత్రాలను కొందరు వ్యక్తులు లాక్కెళ్లిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. నామినేషన్లు దాఖలు చేసే మండల కార్యాలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులకు సెలవులు రద్దు చేశారు. అత్యవసరమైతేనే తప్ప సెలవులు కోరవద్దని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే ఆదేశాలు వెలువడ్డాయి.

ఇదీ చదవండి:

"రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలనను అడ్డుకుందాం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.