శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్, ఎమ్మెల్యే బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఎప్పుడు వచ్చినా తెదేపా సిద్ధంగా ఉందని కూన రవి కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వద్దన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
వైకాపా ప్రభుత్వం వస్తే తిత్లీ తుపానుకు రెట్టింపు పరిహారం ఇస్తామన్నారని.. కానీ నేటికీ తిత్లీ పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు తెదేపా అండగా ఉంటుందన్నారు. డిసెంబర్ 25లోపు తిత్లీ పరిహారం ఇవ్వకపోతే పోరాటం చేస్తామని కూన రవి హెచ్చరించారు. వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే జనవరి తర్వాత కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. రైతుల దగ్గర నుంచి వరి పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం