శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం గుగ్గిలి గ్రామంలో అదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తూలుగు లక్ష్మణరావు, ఎలమంచిలి రాజు అనే రైతులకు చెందిన ఐదు ఎకరాల వరి కుప్పలు కాలిపోయాయి. దీంతో ఆ రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రాజకీయ కక్షతోనే గుర్తుతెలియని వ్యక్తులు ధాన్యం కుప్పలకు నిప్పంటించి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పండించామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: పరదా పట్టల కోసం ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి