శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద విధులు నిర్వహిస్తోన్న జగన్నాథం అనే పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న వ్యక్తి మద్యం కొనుగోలు కోసం దుకాణం వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో నిబంధనలు పాటించాలని సూచిస్తున్న కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అక్కడి కొద్దిసేపు వివాదం నెలకొంది. కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తిపై రాజాం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ చూడండి..