శ్రీకాకుళం జిల్లాలోని 145 గ్రామాలు, 2 పట్టణాల్లో ఫొని తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా 38.43 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు జిల్లా అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసింది.
- 406 హెక్టార్లలో ఉద్యాన, 187 హెక్టార్లలో వరి, 555 హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారుల వెల్లడి
- పత్తి, కొర్ర, మొక్కజొన్న, రాగి, పొద్దుతిరుగుడు, పొగాకు పంటలకు నష్టం
- తుపానుకు దెబ్బతిన్న 162 గృహాలు, 51.25 లక్షల రూపాయలు నష్టం
- పశుసంవర్థక శాఖలో 3.49 లక్షల రూపాయలు నష్టం
- రహదారులు, కాల్వలు, వీధిలైట్లు, తాగునీటి సరఫరా పైపులకు 213.60 లక్షల రూపాయలు నష్టం.
- 3వేల 334 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు
- పునరావాస చర్యల్లో 225 మంది ఎన్డీఆర్‌ఎఫ్, 160 మంది ఎస్డీఆర్‌ఎఫ్, 232 మంది అగ్నిమాపక సిబ్బంది
- పునరావాస కేంద్రాలకు 338.295 మెట్రిక్ టన్నుల బియ్యం, 11.169 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 123.500 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు, 5,338 లీటర్ల పామాయిల్, 70.550 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు, 16 వేల లీటర్ల పాలు తరలింపు
- 312 వైద్య శిబిరాలు, తాగునీటి సరఫరాకు జనరేటర్లు ఏర్పాటుకు రూ. 39.81 లక్షలు ఖర్చు
- విద్యుత్ శాఖకు సంబంధించి రూ.975 లక్షలు నష్టం
ఇవి కూడా చదవండి: