చాలా రోజుల తర్వాత కోవాగ్జిన్ టీకా శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. శనివారం జిల్లా వ్యాప్తంగా 25 కేంద్రాల్లో కోవాగ్జిన్ టీకా వేశారు. విషయం తెలిసి.. చాలామంది కేంద్రాలకు తరలివెళ్లారు. కొందరు ఉదయం 8 గంటలకే వచ్చి క్యూ లైన్లలో నిల్చున్నారు.
అన్ని కోవాగ్జిన్ టీకా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళంలో 19 వేల మందికి టీకా వేయాల్సి ఉండగా కేవలం 5 వేల డోసులు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరికీ 2వ డోసు పూర్తయ్యాకే.. మొదటి డోసు వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి: