ETV Bharat / state

Kukatlapalli murder case: ప్రకాశం జిల్లాలో యువకుడు దారుణ హత్య - ప్రకాశం జిల్లా వార్తలు

తమ కుటుంబ సభ్యులతో అసభ్యకరంగా మాట్లాడాడంటూ.. ఓ యువకుని హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా కూకట్లపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లాలో యువకుడు దారుణ హత్య
ప్రకాశం జిల్లాలో యువకుడు దారుణ హత్య
author img

By

Published : Dec 26, 2021, 11:08 AM IST

Young man murdered at kukatlapalli: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం క్రాస్​ రోడ్డు వద్ద ఓ యవకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్లపల్లి గ్రామానికి చెందిన పల్లెల రామకృష్ణారెడ్డి.. మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన పలువురితో అసభ్యకరంగా మాట్లాడారు. ఆ కుటుంబాలకు చెందిన ఇద్దరు.. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నారు.

ఈ క్రమంలో ఇద్దరు కలిసి శనివారం రాత్రి రామకృష్ణారెడ్డిని ద్విచక్రవాహనంపై గ్రామానికి శివారులోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితులు ద్విచక్రవాహనంపై బల్లికురవ పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి..

CYBER CRIME UNDER LOVE LIFE : వైద్య పరికరాల అద్దె వ్యాపారం పేరిట.. భారీ మోసాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.