ETV Bharat / state

TDP MLA's: 'తెలంగాణ ప్రభుత్వంపై పోరాడలేకే.. మాపై బురద'

author img

By

Published : Jul 12, 2021, 9:56 PM IST

తెలంగాణ ప్రభుత్వంపై పోరాడలేక.. తాము రాసిన లేఖపై మంత్రి అనిల్‌ బురద చల్లుతున్నారని ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాయలసీమకు నీరు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. సీమ కన్నా వెనుకబడిన ప్రకాశం జిల్లాపైనా దృష్టి సారించాలని డిమాండ్ చేశామని చెప్పారు.

tdp mlas fire on minister anil comments
తెలంగాణ ప్రభుత్వంపై పోరాడలేక మాపై బురద
తెలంగాణ ప్రభుత్వంపై పోరాడలేక మాపై బురద

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యకు సంబంధించి... తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయలేక.. తాము రాసిన లేఖపై మంత్రి అనిల్ బురద చల్లుతున్నారని ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతలకు తాము వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రాయలసీమ కన్నా ప్రకాశం జిల్లాలో కరవు ఎక్కువ అని.. తమ జిల్లా పరిస్థితి ఏంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లాకు చట్ట ప్రకారం రావాల్సిన నీటిని ఇచ్చాక మిగిలిన నీటిని రాయలసీమ ఎత్తిపోతలకు వాడుకుంటే తమకెలాంటి అభ్యంతరమూ లేదన్నారు. విందులు, వినోదాలు చేసుకుంటూ ప్రత్యర్థులపై దాడికి మాత్రమే కలుస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడలేరా ? అని నిలదీశారు.

"సీమ కంటే కరవు ప్రాంతమైన ప్రకాశం జిల్లా బాధల్ని, రైతుల కడుపు మంటని లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా ప్రజలకు వ్యవసాయం తప్ప మరో జీవనోపాధి లేనందున.. రైతుల గుండెకోతను లేఖ ద్వారా వివరించాం. విషయాన్ని మంత్రి అనిల్ పక్కదోవ పట్టిస్తూ రాజకీయ పబ్బానికి వాడుతున్నారు. మా వేదనకు సమాధానం చెప్పకుండా మంత్రి అవాకులు చవాకులు పేలారు. 2005 నుంచి సాధారణ వర్షపాతం కంటే 60 శాతం తక్కువ ప్రకాశం జిల్లాలో నమోదవుతూ వస్తోంది. వరుసగా మూడేళ్లు సాధారణ వర్షపాతమైనా నమోదు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం ఎగువ ప్రాంతంలో సామర్థ్యం పెంచుకుంటూ ఎత్తిపోతల పథకాలు చేపట్టడం వల్ల సాగర్ ద్వారా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగు, తాగు నీటి ఎద్దడి ఏర్పడనుంది. జిల్లాలో 4.5 లక్షల ఎకరాలు, గుంటూరు జిల్లాలో 7 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకం కానుంది. ప్రణాళికలు లేని ప్రాజెక్టుల వల్ల దేశంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టైన నాగార్జున సాగర్ పర్యాటక ప్రాంతంగా మారే దుస్థితి ఏర్పడనుంది. చంద్రబాబు హయాంలో వేగంవంతం చేసిన వెలుగొండను పూర్తి చేయటంతో పాటు గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించ తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం." - ఏలూరి సాంబశివరావు, తెదేపా ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లాకు నీరు ఇవ్వాల్సి వస్తుందనే జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా అనిల్ కుమార్ బాధ్యతల నుంచి తప్పుకున్నారని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తమను గెలిపించిన ప్రజలకోసం ప్రతిపక్ష నేతలుగా గళమెత్తుతామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై స్పందించవద్దంటూ జగన్​లా గొంతునొక్కే పనులు చంద్రబాబు చేయరని వీరాంజనేయ చెప్పారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లో మాట్లాడే వైకాపా నేతలకూ తమకూ చాలా తేడా ఉందన్నారు. ప్రజా సంక్షేమంపై జగన్​కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి నీటి వివాదం పరిష్కరిచాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

Rayalaseema Lift: తెలుగుదేశం కాదు.. తెలంగాణ దేశం పార్టీ: మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.