ప్రకాశం జిల్లా దర్శిలోని.. కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రైతు సదస్సులో రైతులకు ఉపయోగపడే వివిధ రకాల పనిముట్లను దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన పనిముట్లు ఎలా ఉపయోగ పడతాయో కళాశాల ప్రిన్సిపాల్ వివరించారు. పనితనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మెట్ట పొలంలో కలుపు మొక్కలను సులభంగా తొలగించడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయని తెలిపారు. వీటితో తక్కువ ఖర్చుతో పొలంలో సేద్యం చేసుకోవచ్చని రైతులకు తెలిపారు. రైతులకు తక్కువ ధరకు పనిముట్లను అందజేస్తామని చెప్పారు. రైతులు ఒక ఎకరాలో కలుపు తీయించేందుకు వేల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది. తాము తయారు చేసిన పనిముట్లతో కేవలం ఒక్క మనిషితో మూడు గంటల్లో ఎకరా పొలంలో కలుపును తొలగించవచ్చని చేసి చూపించారు.
ఇదీ చదవండి: