ETV Bharat / state

లాక్ డౌన్ అమలుకు ప్రజలు సహకరించాలి: ప్రకాశం ఎస్పీ

ఒంగోలులో లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ ఆకస్మికంగా పర్యటించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు.

sp tour on bike at ongole
ఒంగోలులో ఎస్పీ పర్యటన
author img

By

Published : Jul 1, 2020, 8:06 PM IST

ప్రకాశంజిల్లా ఒంగోలులో లాక్​డౌన్ అమలు తీరుని పరిశీలించేందుకు ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ ఆకస్మిక పర్యటించారు. బుల్లెట్​పై తన సిబ్బందిని వెంట పెట్టుకొని బస్టాండ్, కర్నూలు రోడ్, గాంధీ రోడ్​లో పర్యటించారు. లాక్​డౌన్ కారణంగా కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని, ప్రజలు అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని ఆదేశించారు. బయటకు వచ్చినా.. భౌతిక దూరాన్ని పాటించాలని.. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.