ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద పాము కలకలంరేపింది. పనిమీద కలెక్టరేట్‌కి స్కూటీ మీద వచ్చిన ఓ వ్యక్తి పాదం మీద నుంచి పాము వెళ్లటాన్ని చూసిన మరో వ్యక్తి అరిచాడు. అది గమనించిన వ్యక్తి కాళ్లను ఒక్కసారిగా విదల్చటంతో పాము కింద పడి నేరుగా స్కూటీ ఇంజన్ బాగంలోకి చేరింది. అనంతరం ఓ కర్రతో స్కూటీ సీట్, ఆయిల్ ట్యాంక్, ఇంజన్లో చూడగా... వైర్లతో పెనవేసుకుని పాము కనిపించింది. వెంటనే కర్రతో పామును బయటకు తీసి చంపేశారు.
ఇదీ చూడండి: పాఠశాలలో పాము... పరుగులు తీసిన విద్యార్థులు