ETV Bharat / state

సంకల్ప సిద్ధి మార్ట్​ యాప్​ మోసాలు.. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు

Sankalpa Siddhi Mart: సంకల్ప సిద్ధి మార్ట్​ యాప్​ పేరిట జరిగిన మోసాలలో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రకాశం జిల్లాలో మోసపోయామని బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వేల రూపాయలు వసూలు చెేసి మోసం చేశారని బాధితులు వాపోతున్నారు.

SANKALPA SIDDI MART
సంకల్ప సిద్ధి మార్ట్
author img

By

Published : Nov 30, 2022, 4:42 PM IST

Sankalpa Siddhi Mart App Frauds: ప్రకాశం జిల్లా కనిగిరిలో సంకల్ప సిద్ధి మార్ట్ యాప్ మోసాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కనిగిరి పరిధిలో సంకల్ప సిద్ధి సంస్థ ఎర్రచందనం, శ్రీ గంధం మొక్కలను ఎరగా చూపి.. ప్లాట్ అగ్రిమెంట్లు రాయించి మోసగించారని బాధితులు వాపోయారు. సంస్థ యాప్‌లో సుమారు 200 మంది పెట్టుబడులు పెట్టామని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.

సంకల్ప సిద్ధి యాప్​తో మోసపోయిన వారు ఒక్కోక్కరుగా బయటకు వస్తున్నారు. తక్కువగా ఉన్నారనుకున్న బాధితుల సంఖ్య.. ఇప్పుడు దాదాపు 200 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ మోసం లేదని మొదట నమ్మించి.. సంకల్ప సిద్ధి ఏర్పాటు చేసిన ప్లాట్లను, ఆ ప్లాట్​లలో వేసిన ఎర్రచందనం, శ్రీ గంధం మొక్కలను ఎరగా చూపెట్టి మోసాలకు పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. లక్ష రూపాయలు చెల్లిస్తే మూడు వందల రోజుల వరకు.. రోజుకు వెయ్యి రూపాయల చొప్పున తమ పేరుపై యాప్​లో జమ చేస్తామని తెలిపారని అన్నారు. దీనికోసం అగ్రిమెంట్లూ రాయించుకున్నారని తెలిపారు. బాధితులు ఒక్కొక్కరూ రూ.50 వేల వరకు సంస్థకు చెల్లించామని అన్నారు. మొదట యాప్​లో తమ ఖాతాలో నగదు జమ చేసినా.. తర్వాత తగ్గిసూ వచ్చారని, సాంకేతిక సమస్యలు అంటూ పూర్తిగా జమ చేయడం మానేశారని వాపోయారు. అనుమానం వచ్చిన బాధితులు విజయవాడ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

కనిగిరిలో వెలుగుచూస్తున్న సంకల్ప సిద్ధి మార్ట్ మోసాలు

"డబ్బులు వస్తాయని చెప్పటంతో ఆశపడి కట్టాను. కంపెనీ ఎత్తిపోవటంతో మేము కట్టిన డబ్బులు మోసపోయాము. మాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుకుంటున్నాము." - బాధితుడు

"సంకల్ప సిద్ధి పేరుతో సమాచారం నాకు తెలవటంతో నేను 56 వేల రూపాయలు కట్టాను. 20 రోజులుకు నాకు 40వేల రూపాయలు చెల్లించారు. మిగతా నగదు నాకు రావాల్సి ఉంది. తీరా ఇప్పుడు చూసాక యాప్​నే తీసేశారు. పోలీసులు న్యాయం చేయాలి." -బాధితుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.