రైతులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా నియోజకవర్గ బాధ్యుడు రావి రామనాథం బాబు అన్నారు. పర్చూరులో ఐదు రైతు భరోసా కేంద్రాలను రామనాథం ప్రారంభించారు. రైతుభరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శమని రామనాథం బాబు పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో లభిస్తాయని రామనాథం అన్నారు. భూసార పరీక్షలు అక్కడే చేస్తారని తెలిపారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు