విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు, ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబాతో పాటు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్ర చేనేత జన సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావు మాట్లాడుతూ.. వరవరరావు ఒక కవిగా, పీడిత ప్రజల కోసం ఎంతో పాటుపడ్డారాన్నారు.
అంగవైకల్యంతో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాని కూడా వెంటనే విడుదల చేయాలని డిమాడ్ చేశారు.కరోనా ప్రబలుతున్న తరుణంలో వృద్ధాప్యంలో ఎటువంటి విచారణ లేకుండా ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలన్నారు.