ప్రకాశం జిల్లా నుంచి బీహార్, ఉత్తర్ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వలస కూలీలను... అధికారులు ఒంగోలు క్వారెంటైన్లో ఉంచారు. వెంటనే వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని వారు ఆందోళన చేశారు.
వారం రోజుల క్రితం తమిళనాడు ప్రాంతం నుంచి కాలినడకన బయలుదేరిన తమను... జిల్లా అధికారులు ఆపివేసి క్వారంటైన్‌లో ఉంచారని, ప్రత్యేక రైళ్లలో పంపిస్తామని హామీ ఇచ్చి... ఇప్పటివరకు పంపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమను సొంతగూటికి తరలించే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: