ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొండాయపాలెం సమీపంలోని గ్రానైట్ క్వారీలో చేపట్టిన పేలుళ్లు.... ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఎస్సై శివనాంచారయ్య తెలిపిన సమాచారం మేరకు.. తమిళనాడుకు చెందిన మునుస్వామి ఆర్ముగం(47).. కొండాయపాలెం సమీపంలోని గ్రానైట్ క్వారీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన పని చేసే క్వారీ సమీపంలో నిమరో క్వారీలో పేలుళ్లు సంభవించాయి.
ఈ ధాటికి ఓ గ్రానైట్ రాయి ఎగిరి వచ్చి మునుస్వామి తలపై పడింది. ఆయన ఘటన స్థలంలోనే కుప్పకూలి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలనుఅడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: