ప్రకాశం జిల్లా కొరిశపాడులో లారీ క్యాబిన్ మీద నుంచి టైరును దించుతూ ప్రమాదవశాత్తు జారి పడి క్లీనర్ మృతి చెందాడు. బద్వేల్ నుంచి గుంటూరు బొగ్గు లోడుతో బయలుదేరిన లారీ... మేదరమెట్ల జాతీయ రహదారిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో టైర్ పంచర్ అయింది. టైర్ల దుకాణం దగ్గర క్యాబిన్ మీద ఉన్న అదనపు టైరు దించే క్రమంలో పోరుమామిళ్ల కు చెందిన నాయబ్ కింద పడగా... బలమైన గాయం అయింది. పక్కనే ఉన్న డ్రైవర్ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే నాయబ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతదేహాన్ని అద్దంకి మార్చరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి-అరచేతిలో అంజనం.. అమాయక జనాలే లక్ష్యం!