భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో... దేశంలోని వివిధ పర్యాటక స్థానాలకు ఉత్తర భారత యాత్ర పేరిట స్పెషల్ రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా ఆగస్టు 27 నుంచి రేణిగుంట నుంచి ఉత్తర భారత యాత్ర ప్రత్యేక రైలు ఉంటుందని ఐఆర్సీటీసీ సౌత్‌జోన్ మేనేజర్ మురళి తెలిపారు. ఈ ట్రైన్ నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, ఖాజీపేట మీదుగా వెళ్తుందని వెల్లడించారు.
ఆగ్రా, మథుర, మాతా వైష్ణో దేవి, అమృత్సర్, హరిద్వార్, దిల్లీ మీదుగా యాత్ర సాగుతుందని తెలిపారు. 11 రోజుల పాటు యాత్ర ఉంటుందని.. స్టాండ్ స్లీపర్ క్లాస్ ధర రూ.10,400, కంఫర్ట్ ఏసీ త్రీటైర్ రూ.17,330గా భారతీయ రైల్వే శాఖ నిర్ధారించిందని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో టీ, కాఫీ, అల్పాహారం, భోజనం అందించనున్నట్లు చెప్పారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలతో ఈ యాత్ర చేపడుతున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:
Prank Video Failed : ప్రాంక్ వీడియో కాస్తా.. ఫైట్ వీడియో అయింది!
SRISAILAM: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల