కరోనా.. సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే.. అక్రమార్కులకు మాత్రం అది వరంగా మారింది. జనం ఎవరూ బయట తిరగని వేళ యథేచ్ఛగా, ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం వద్ద ఉన్న కొండను తొలిచేస్తున్నారు. కొంతమంది కొండ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మట్టి ట్రాక్టర్లు రెవెన్యూ కార్యాలయం ముందు నుంచే వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.
దీనిపై దర్శి మండల తహసీల్దారుని ఫోనులో వివరణ కోరగా.. మట్టి తవ్వకాలకు ఎవరికీ ఎటువంటి అనుమతులు లేవన్నారు. మట్టి తవ్వుతున్న కొండ ప్రాంతాన్ని పరిశీలించి.. అనధికార తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చదవండి..: ఆ లారీ తల తెగింది... అయినా దూసుకెళ్తోంది..!