కరోనా ధాటికి గ్రానైట్ పరిశ్రమ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. నాణ్యమైన ముడిపదార్ధాలు దొరక్క..వ్యాపారం లేక.. ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రకాశం జిల్లాలో గ్రానైట్ యూనిట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైపుణ్యంలేని కార్మికులతో ...పనులు సజావుగా సాగడంలేదు.
జిల్లాలో ఒంగోలు, బల్లికురవ, మద్దిపాడు, మార్టూరు ప్రాంతాల్లో వేలల్లో గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇందులో ఒక గ్రో సెంటర్‌లోనే 200కు పైగా యూనిట్లు ఉన్నాయి. కరోనా కారణంగా కార్మికులు స్వస్థలాకి వెళ్లిపోవటంతో యజమానులు ఆర్థికంగా నష్టపోయారు. దాదాపు 7 నెలల తర్వాత మళ్లీ ఎగుమతులు మొదలైనా.... నాణ్యమైన గ్రానైట్ ముడిపదార్థాలు దొరక్క యజమానులు అవస్థలు పడుతున్నారు. కార్మికుల్లోనూ నైపుణ్యం లోపించటంతో గ్రానైట్ పనులు అంత సాఫీగా జరగటం లేదని ఆవేదన చెందుతున్నారు.BYTE
ప్రస్తుతం కరోనా తగ్గుదలతో గ్రానైట్ రాయి ఇతర దేశాలకు ఎగుమతులు పెరిగాయి. వందల సంఖ్యలో గ్రానైట్ రాయి కంటైనర్లు కృష్ణపట్నం చెన్నై పోర్టుకు వెళ్తున్నాయి. అలా వెళ్ళిన కంటైనర్లు తిరిగి రాక కటింగ్ పాలిషింగ్ యూనిట్లలో కంటైనర్ల కొరత ఏర్పడింది. ఎక్కువ ఖర్చైనప్పటికీ చెన్నై పోర్ట్ నుంచి కంటైనర్లు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
నాణ్యమైన గ్రానైట్ ముడి పదార్థాలు, నైపుణ్యం లేని కార్మికులతో పనులు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి. చిన్నవయసులో పెద్ద కష్టం!