ప్రకాశం జిల్లా చీరాలలో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు కొందమంది దాతలు ముందుకొచ్చారు. క్షీరపురి బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో చీరాల సీఐ ఫిరోజ్, బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధి శర్మ 200 మంది పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ఆంక్షల కారణంగా ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి: