ETV Bharat / state

పర్చూరు స్టేట్​బ్యాంక్ ఏటీయంలో మంటలు - Fire accident in parchoor statebank atm news

ప్రకాశం జిల్లా పర్చూరులోని స్టేట్​బ్యాంక్ ఏటీయంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు రావటం గమనించి అప్రమత్తమైన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

Fire accident at the State Bank Atm
ఏటీయంలో చెలరేగిన మంటలు
author img

By

Published : Jan 25, 2021, 10:33 AM IST

పర్చూరులోని స్టేట్​బ్యాంక్ ఏటీయంలో మంటలు

ప్రకాశం జిల్లా పర్చూరులోని స్టేట్​బ్యాంక్ ఏటీయంలో మంటలు చెలరేగాయి. ఏటీయం గదిలో నుంచి పొగలు రావటాన్ని గమనించిన స్థానికులు.. బ్యాంకు అధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నీళ్లు చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు కరెంట్​ సరఫరా నిలిపివేశారు.

పోలీసులు, బ్యాంక్​ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏటీయం మిషన్ లోపల ఉన్న నగదు సురక్షితంగానే ఉంటుందని చెప్పారు.

ఇదీ చదవండి:

2 జిల్లాల్లో ప్రమాదాలు... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.