ప్రకాశం జిల్లా చీరాలలో లాక్డౌన్ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. చీరాల, కుంకలమర్రులో ఆదివారం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కారంచేడులోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 14 వరకూ లాక్డౌన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. కర్ఫ్యూకి ప్రజలంతా సహకరించాలని చీరాల సీఐ ఎన్. నాగమల్లేశ్వరరావు కోరారు. అనవసరంగా ఎవరైనా రహదార్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: చీరాలలో ప్రశాంతంగా లాక్డౌన్