ప్రకాశం జిల్లా చీరాలలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా.. అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా కారణంగా సినిమా హాళ్లు మూతపడిన కారణంగా.. ఇబ్బంది పడుతున్న సినిమా హాళ్ల సిబ్బందికి నిత్యావసర వస్తువులు అందజేశారు.
ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మార్పు గ్రేగోరి పాల్గొన్నారు. సినీ పోటి ప్రపంచంలో ఒంటరిగా ఎదిగిన వ్యక్తి చిరంజీవి అని ప్రశంసించారు. నేత్రదానం, బ్లడ్ బ్యాంకులను స్థాపించి ఎంతో మందికి ప్రాణాలు నిలిపిన మహోన్నత వ్యక్తి అని కితాబునిచ్చారు.
ఇదీ చదవండి:
కరోనా ట్రెండ్: ఫేస్ షీల్డ్‌తో లంబోదరుడు... పీపీఈ కిట్‌లో మూషికం