ETV Bharat / state

అభివృద్ధి రంకె వేస్తున్న.. ఒంగోలు గిత్తల ఉత్పత్తి కేంద్రం! - chadalavada livestock production

ఒంగోలు గిత్త. ఈ పేరు వినగానే నడకలో రాజసం.. రూపంలో తేజసం.. పోటీల్లో పౌరుషం.. కళ్లముందు కదలాడతాయి. ప్రకాశం జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ ఒంగోలు జాతి పశువుల అభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటైంది.. చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం. కొన్నేళ్లుగా అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ క్షేత్రం.. మౌలిక వసతుల్ని సమకూర్చుకుంటూ పూర్వ వైభవంగా దిశగా అడుగులు వేస్తోంది.

chadalavada
chadalavada
author img

By

Published : Oct 28, 2021, 3:08 PM IST

ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలంలోని చదలవాడ పశుఉత్పత్తి క్షేత్రంలో మొన్నటి వరకూ నిర్వహణ భారంగా ఉండేది. ఒంగోలు జాతి పశుగణాభివృద్ధికి, నాణ్యమైన కోడెదూడల ఉత్పత్తికి ఏర్పాటు చేసిన ఈ పశు క్షేత్రం.. లక్ష్యాలకు దూరంగా ఉండేది. సుమారు 190 ఎకరాల భూమి.. పశుఉత్పత్తి క్షేత్రం కింద ఉన్నా.. ఇక్కడి 200 పశువులకు గ్రాసం అందించలేని పరిస్థితి ఉండేది. అయితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఊపిరిపోసుకుని.. పశువుల వృద్ధిలో చక్కటి ఫలితాలు సాధిస్తోంది. విశాలమైన షెడ్లు, తాగునీటి సౌకర్యాల ఏర్పాటుతోపాటు సొంతంగా పశుగ్రాస క్షేత్రాలను అభివృద్ధి చేయటం ద్వారా అధికారులు.. లక్ష్యం దిశగా సాగుతున్నారు. ఈ ఏడాది 80 దూడల ఉత్పత్తి జరిగింది.

అప్పుడు ఇబ్బందులు..కేంద్రం నిధులతో ఇప్పుడు సత్ఫలితాలు

గతంలో పశువులను ఆరు బయటే కట్టేయడం వల్ల తరచూ అనారోగ్యం బారిన పడి ఆలస్యంగా ఎదకు రావడం, తక్కువ పాలివ్వడం జరిగేది. అయితే.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గోచార్‌ మిషన్‌లో భాగంగా సుమారు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయటంతో.. ఈ పశుఉత్పత్తి క్షేత్రం రూపురేఖలు మారిపోయాయి.

రూ.6కోట్లతో విశాలమైన షెడ్లు, అంతర్గత సిమెంట్‌ రహదారులు, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. 140 ఎకరాల్లో ఏకవార్షిక పశుగ్రాసాలు, మరో 35 ఎకరాల్లో బహు వార్షిక గడ్డి రకాలను పెంచుతున్నారు. కేంద్రం సహకారం, అధికారుల చొరవతో ఈ పశుఉత్పత్తి క్షేత్రం...నాణ్యమైన పశువులను ఉత్పత్తి చేస్తోంది. ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.

ఇదీ చదవండి: protest on petrol price : పెరిగిన పెట్రో, డీజిల్ ధరలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.