జీవనమృతుడిగా మారిన వ్యక్తి అవయవాలు దానం చేసి....ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. ప్రకాశం జిల్లా చందులూరు గ్రామానికి చెందిన నూతలపాటి వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంకటేశ్వర్లుని వైద్యులు జీవనమృతుడిగా నిర్ధరించారు. గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో అతని అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. ధైర్యంగా ముందుకు వచ్చి గొప్ప మనసు చాటుకున్న కుటుంబాన్ని వైద్యులు అభినందించారు.
ఇదీ చదవండి