ప్రకాశం జిల్లా మార్టూరులోని దుర్గా మల్లీశ్వరస్వామివారి ఆలయంలో 11 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా నిర్వహించే అఖండ కర్పూర జ్యోతి మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది. 250 కిలోల కర్పూరంతో అఖండ కర్పూర జ్యోతిని వెలిగించగా... వేలాది మంది భక్తులు జ్యోతి దర్శనం చేరుకున్నారు. శివయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. హిందూ-ముస్లిం భాయ్ బాయ్ అంటూ.. అఖండ కర్పూర జ్యోతి కార్యక్రమం నిర్వహించడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. మార్టూరుకు చెందిన విఘ్నేశ్వర కూరగాయల మార్కెట్ సంఘం ప్రతినిధి షేక్ మహమ్మద్ బుడే.. 11 ఏళ్లుగా శివయ్యను ఆరాధిస్తూ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా భారీ కర్పూర జ్యోతి మహోత్సవం నిర్వహిస్తుంటారు. తాను ముస్లిం అయినప్పటికీ చిన్ననాటి నుంచి శివ భక్తుడిని అని మహమ్మద్ బుడే చెబుతున్నారు.
ఇదీ చదవండి