ETV Bharat / state

వృద్ధురాలినయ్యా...నన్ను కొట్టడం నీకు న్యాయమేనా!

వైద్యో నారాయణ హరి అంటాం. జీవం పోసే వైద్యుడే రోగులపై పిడిగుద్దులు గుద్దితే..! పాపం ముసలవ్వ.. నిలబడలేక వైద్యుడి గదిలో కూర్చున్న పాపానికి వైద్యుడి చేత దెబ్బలు తినాల్సి వచ్చింది.

వృద్ధురాలిని కొట్టిన వైద్యుడు
author img

By

Published : Jul 16, 2019, 3:38 PM IST

వృద్ధురాలిని కొట్టిన వైద్యుడు

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులపై వైద్యుడు హరి దురుసుగా ప్రవర్తించాడు. వైద్యం చేయించుకునేందుకు వచ్చిన బాలీ భాయ్ అనే వృద్ధురాలు నిస్సహాయ స్థితిలో వైద్యుడి గది​లో కూర్చుంది. నువ్వు ఇక్కడ కూర్చునేదానివా అంటూ వృద్ధురాలిని దుర్భాషలాడుతూ, పిడి గుద్దులు గుద్దాడు. అదేంటని ప్రశ్నించిన ఆమె మనుమరాలు లాలూబాయ్​పై కుడా దాడి చేసినట్లు పలువురు తెలిపారు. ఎక్కువమంది రోగులున్నప్పుడే ఘటన జరగడంతో అతని నిర్వాకాన్ని అందరూ తప్పుపట్టారు. దీనితో ఒకింత ఆందోళన చోటు చేసుకుంది. మార్కాపురం పోలీసు స్టేషన్​లో వైద్యుడు హరిపై బాధితులు పిర్యాదు చేశారు. గదిలో కూర్చుంటే బయటకి వెళ్లిపో అని చెప్పితే బాగుండేది కానీ.. ముసలవ్వను కొట్టడం న్యాయమేనా.. ఇది వైద్యులకు తగినదేనా అని బామ్మ మనుమరాలంటోంది.

ఇదీ చూడండి:ప్రజల గొంతు ఎండిపోతోంది

Intro:తెదేపా, వైసీపీ కార్యకర్తల ఘర్షణ

అనంతపురం జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో తెదేపా, వైకాపా నాయకులు మధ్య ఘర్షణ. ఏకాదశి పర్వదినం సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీల్లో భాగంగా తెదేపా నాయకులు తమ బండ్లకు తెలుగుదేశం జెండాలను కట్టుకుని పందెలకు వచ్చారు.. దీంతో వైకాపా నాయకులు వైసీపీ జెండాలతో ఎదురెళ్లి తెదేపా నాయకులతో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో ఇరు వర్గాల వారు పరస్పర దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 10 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. దీంతో వైకాపా నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తెదేపా నాయకులను అరెస్ట్ చేయాలంటూ ధర్నా చేపట్టారు.

Body:పోర్టర్: రామ్మోహన్
సెంటర్: పుట్టపర్తి, అనంతపురం జిల్లా

Conclusion:పుట్టపర్తి, అనంతపురం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.