ETV Bharat / state

'ఎస్పీబీ భౌతికంగా దూరమైనా... పాట రూపంలో మనతోనే ఉన్నారు'

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని వైకాపా ముఖ్య నేతలు పేర్కొన్నారు. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. మంత్రి మేకపాటి, ఎంపీ విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ సంతాపం తెలిపారు.

sp balasubramaniam
sp balasubramaniam
author img

By

Published : Sep 25, 2020, 4:53 PM IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచం గర్వించే అరుదైన గాయకుడు ఇలా దూరమవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. పాట కోసమే పుట్టిన మహానుభావుడు ఎస్పీ అని కొనియాడారు. ఆయన లేని లోటు మరే గాయకుడు పూడ్చలేనిదని మంత్రి పేర్కొన్నారు.

గాయకుడిగా, మంచి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్​గా బహుముఖ ప్రజ్ఞ కలిగిన బాలసుబ్రహ్మణ్యం కారణ జన్ములుగా మంత్రి మేకపాటి అభివర్ణించారు. ఆయన భౌతికంగా దూరమైనా 'పాట'లో మనతో శాశ్వతంగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు.

16 భాషలలో 40 వేలకుపైగా మధురమైన పాటలు పాడి అరుదైన ఘనత సాధించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఆయన మనతో ఉండకపోవచ్చు కానీ... ఆయన పాడిన పాటలు తరతరాలు నిలుస్తాయి. బాలు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి- విజయసాయి రెడ్డి, వైకాపా ఎంపీ

తెలుగు నాట జన్మించి తన మధుర గాత్రంతో ప్రపంచాన్ని మత్రముగ్ధుల్ని చేసిన మహనీయుడు ఎస్పీ బాలు. భారత దేశ చలనచిత్ర రంగంలో కేవలం తన గాత్రంతోనే కాకుండా నటనలోనూ ఎనలేని ముద్రవేసిన మహానుభావుడు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది - సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు

ఇదీ చదవండి

గుండెలకు హత్తుకునే తమ్ముడ్ని కోల్పోయా: రామోజీరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.