ETV Bharat / state

ప్రత్యర్థి కోసం ప్రచారం చేశారని... దాడి చేశారు - ap elections

గతంలో ఎన్నడూలేని విధంగా... ఈ సార్వత్రిక ఎన్నికలు పలుచోట్ల నెత్తుటి మరకలతో ముగిశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన గొడవలు స్థానిక నేతల ప్రాణాల్నీ బలిగొన్నాయి. సాక్షాత్తు సభాపతి కోడెలపై దాడి జరిగింది. రక్షణ సిబ్బంది ఉన్నా... వైకాపా దాడులను ఆపలేకపోయారు. ఈ దాడులు పోలింగ్​తో ముగుస్తాయనుకుంటే... కొందరి దూకుడు స్వభావంతో ఇంకా పెరుగుతున్నాయి. స్వయాన ఎమ్మెల్యేగా ఉన్న నేతలే దాడుల్ని ప్రోత్సహించటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

ప్రత్యర్థి కోసం ప్రచారం చేశారని... దాడి చేశారు
author img

By

Published : Apr 18, 2019, 6:43 AM IST

ఎన్నికల్లో ప్రత్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారనే కారణంతో తెదేపా యువనేత తిరుమలనాయుడుని హత్య చేయడానికి ప్రయత్నించడం నెల్లూరు జిల్లాలో సంచలనం రేకెత్తించింది. ఏప్రిల్ 11న పోలింగ్ తరువాత నెల్లూరులో తెదేపా నేతపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులే దాడి చేశారని పోలీసులు తేల్చారు. ఈ దాడి వెనుక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి ప్రోత్సాహం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే నెల్లూరులో ఇలాంటి నేర సంస్కృతికి తెరలేపిన వైకాపా తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

అబ్దుల్ అజీజ్​కు మద్దతుగా ప్రచారం చేశారని...
ఈ ఎన్నికల ప్రచారంలో తెదేపా నెల్లూరు గ్రామీణ అభ్యర్థి అబ్దుల్ అజీజ్​కు మద్దతుగా ప్రచారం చేశారని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలపై వైకాపా కార్యకర్తలు 14వ తేదిన దాడి చేశారు. వైకాపాకు చెందిన ఏడుగురు ఇనుపరాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి తన అనుచరులతో హత్య చేయించేందుకు యత్నించారని బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు... ఏడుగురు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు. వీరిలో కొందరు ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు ఉన్నట్లు తేలింది.

నేర చరిత్ర కలిగిన వారే...
దాడిలో పాల్గొన్నవారి చరిత్ర చూస్తే నేరప్రవృత్తి ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఏ1గా ఉన్న విజయరామరాజు ఓ హత్య కేసులో నిందితుడు. అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. ఏ3 నిందితుడు ఆండ్రోస్ సెబాష్టియన్ అభిషేక్​పై వేదాయిపాలెం పోలీసుస్టేషన్​లో రౌడీషీటు ఉంది. ఏ4 నిందితుడు గిరీష్​కుమార్ హత్యాయత్నం కేసులో నిందితుడు. పథకం ప్రకారమే మరికొందరిపై దాడులు చేసేందుకు వైకాపా నాయకులు ప్రణాళిక వేసుకున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

వైకాపా దాడులపై తెదేపా శాంతియుత నిరసన చేస్తోంది. ఈ దాడులు కేవలం నెల్లూరు జిల్లాకే పరిమితం కాకుండా... రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వ్యాపించాయి. వద్దని చెప్పాల్సిన నేతలే దాడుల్ని ప్రోత్సహించడం ఆందోళన కలిగిస్తోందని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Intro:Ap_cdp_46_17_nedu_vontimitta_kodandaramuni_kalyanam_Av_c7
కడప జిల్లా ఒంటిమిట్ట ఏకశిలానగరిలో కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది సంభవించిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ సారి కళ్యాణమండపానికి ఎదురుగా పందిళ్లను వేయలేదు. కళ్యాణ వేదికను అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. సుమారు లక్ష మంది భక్తులు కూర్చొని శ్రీరామచంద్రమూర్తి కళ్యాణాన్ని తిలకించేలా సకల ఏర్పాట్లు చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కళ్యాణ వేదికను సుందరంగా తీర్చిదిద్దడం తో పాటు స్వామివారి ఇ కళ్యాణాన్ని చక్కగా చూసే విధంగా ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయం నుంచి కళ్యాణ వేదిక వరకు విద్యుత్ దీపాల అలంకరణ, దేవతామూర్తుల చిత్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఒంటిమిట్ట క్షేత్రానికి 3 లోమీటర్ల దూరం నుంచి ఆకాశం వైపు చూస్తే ఆకాశమంతా విద్యుత్ వెలుగులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది.

Body:నేడు ఒంటిమిట్ట కోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవం

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.