ETV Bharat / state

నా భర్తను సస్పెండ్​ చేశారు కానీ.. నాకు న్యాయం జరగలేదు..

author img

By

Published : May 27, 2022, 9:43 PM IST

తన కాపురాన్ని నిలబెట్టాలని నెల్లూరు జిల్లాలో ఓ మహిళ ప్రాధేయపడుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త.. తనను ఇంట్లో నుంచి గెంటేశాడని వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

రోజా రాణి
రోజా రాణి

తన కాపురాన్ని నిలబెట్టి.. న్యాయం చేయాలని మంగళగిరి ప్రాంతానికి చెందిన రోజారాణి అనే మహిళ.. నెల్లూరులో వేడుకుంది. నెల్లూరు నగరంలో నివాసముంటున్న వినోద్ కుమార్.. శిక్షణ ఎస్ఐగా ఉన్న సమయంలో తనను ప్రేమించి.. 22 ఆగస్టు 2021న ఎస్.బి.ఎస్. కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపారు. కట్నకానుకల కింద 30 లక్షల రూపాయల వరకు ముట్టచెప్పామన్నారు.

వివాహమైన రెండు నెలల తర్వాత నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త వేరే మహిళతో చాటింగ్ చేస్తుండటంతో.. ప్రశ్నించిన తనను హింసించి ఇంట్లో నుంచి గెంటేశారని వాపోయారు. తనకు జరిగిన అన్యాయంపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. విచారణ చేసిన పోలీసులు వినోద్ కుమార్​ను ఎస్.ఐ విధుల నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. అయితే తనకు ఎలాంటి న్యాయం జరగలేదని.. కౌన్సిలింగ్ ఇచ్చి తన కాపురాన్ని నిలబెట్టాలని ఆమె కోరుతున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణలో మరో పరువు హత్య.. ఈసారి కన్న కూతురినే హతమార్చిన తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.