ETV Bharat / state

ఎన్నికలప్పుడే హామీలు.. ఎక్కడి సమస్యలు అక్కడే!

దేశ ప్రగతి గ్రామాల నుంచే మొదలవుతుంది. గ్రామీణ ప్రాంతాలు బాగుంటే.. మండలాలు.. జిల్లాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నట్లు భావించాలి. కీలకమైన గ్రామీణ ప్రాంతాలను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్నికవుతున్న సర్పంచ్​లు అభివృద్ధివైపు దృష్టి కేంద్రీకరించడం లేదు. ఒక్కసారి నెల్లూరు జిల్లాలో పంచాయతీల పరిస్థితిని చూస్తే..

villages problems in nellore
villages problems in nellorevillages problems in nellore
author img

By

Published : Feb 4, 2021, 5:03 PM IST

నెల్లూరు జిల్లాలో 46 మండలాలు. 941 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కనీస సౌకర్యలు లేనివి 70 శాతంపైగా ఉన్నాయి. అభివృద్ధి చేసిన పంచాయతీలను చూస్తే చాలా తక్కువ అని చెప్పాలి. రోడ్డు ఉంటే మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండదు. చెత్తను పడేసేందుకు డంపింగ్ యార్డ్​ ఉండదు.

కొన్నేళ్లుగా పంచాయతీల అభివృద్ధి కుంటుపడి ఉంది. చాలా తక్కువ మంది సర్పంచ్​లు మాత్రమే అభివృద్ధి చేశారు. మిగిలిన పంచాయితీలను చూస్తే సమస్యలు దర్శనమిస్తూనే ఉన్నాయి. కావలి, ఆత్మకూరు, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు డివిజన్లలో అనేక గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. గ్రామాలకు వెళ్లితే ఓటర్లు అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారాలకు వచ్చిన నాయకులు రోడ్లు వేస్తాం.. మురుగుకాలువలు నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారేగానీ.. పట్టించుకోవడం లేదని ఆయా గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు లేని గ్రామాలు అనేకం ఉన్నాయని చెబుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకుండా మళ్లీ ప్రచారాలకు వస్తున్నారని.. నాయకులను నిలదీస్తామని ప్రజలు అంటున్నారు. కాలనీల్లో శివారు ప్రాంతాలు చూస్తే దుర్గంధంతో నిండి ఉంటాయి. ఇళ్ళ మధ్యే డంప్పింగ్ యార్డులు ఉంటాయని పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.