ETV Bharat / state

వడదెబ్బతో ఇద్దరు మృతి - sun stroke deaths in nelore

నెల్లూరు జిల్లాలో సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఎండలు 50 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. జిల్లాలో వడదెబ్బ ధాటికి ఇద్దరు మృతి చెందారు.

sun stroke deaths in nelore
వడదెబ్బతో ఇద్దరు మృతి
author img

By

Published : May 23, 2020, 5:07 PM IST

నెల్లూరు జిల్లాలో ఎండలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. వడగాల్పులు వీస్తున్న కారణంగా.. పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. అనంతారం మండలం అగ్రహారం గ్రామంలో.. చెందిన మిర్చి పంటకు కాపలాగా ఉన్న నరేశ్ (15) వడదెబ్బతో మృతి చెందాడు. 11 గంటలైనా ఇంటి రాకపోవటంతో కుటుంబసభ్యులు పొలం వెళ్లి చూడగా విగత జీవిగా పడివున్నాడు. వడదెబ్బతోనే చనిపోయినట్టు డాక్టరు నిర్ధరించారు.

మర్రిపాడు మండలం రాంపల్లి లో లక్ష్మయ్య అనే వృద్ధుడు పొలం పనులకు వెళ్లి వడ దెబ్బ తగిలి స్పృహ కోల్పోగా... ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో చనిపోయాడు. రెండు రోజులుగా భానుడి ప్రతాపం 50 డిగ్రీలకు చేరుకున్న పరిస్థితుల్లో.. ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రెండు రోజులు ఇదే తరహా ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

'ప్యాకేజీ'తో సామాన్యుడికి ప్రయోజనమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.