ETV Bharat / state

దొంగను పట్టించింది కారం... స్థానికులు చేశారు ఒళ్లు హూనం...

author img

By

Published : Jul 1, 2020, 3:56 PM IST

Updated : Jul 1, 2020, 4:13 PM IST

నెల్లూరు జిల్లాలోని శాంతినగర్​లో దొంగతనానికి యత్నింతిన ఓ దుండగుడికి... స్థానికులు దేహశుద్ధి చేశారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు.

thief was beaten by locals in shanthinagar at nellore district
చోరికి యత్నించిన దొంగకు స్థానికుల దేహశుద్ది

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం శాంతినగర్​లో దొంగతనానికి ప్రయత్నించిన ఓ దొంగకు స్థానికులు దేహశుద్ది చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాంతినగర్ లోని ఓ ఇంట్లోకి కారంపొడి, బ్లేడుతో వెళ్లిన దొంగ చోరీకి ప్రయత్నించాడు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి రావడం చూసిన మహిళ అప్రమత్తమైంది. మహిళ అలికిడి తెలుసుకున్న దొంగ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. తను తీసుకొచ్చిన కారం పొడి, బ్లేడ్​ కింద పడిపోయింది. చాకచక్యంగా వ్యవహరించిన మహిళ... ఆ కారం పొడిని తీసుకొని దొంగపై చల్లింది. గట్టిగా కేకలు వేసింది. ఈ గోలతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి దొంగను పట్టుకున్నారు. చెట్టుకు కట్టి, దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

దాడికి గురైన మహిళా ఉద్యోగిని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషనర్

Last Updated : Jul 1, 2020, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.