ఉద్యాన శాఖ ఇప్పటివరకు నిమ్మ, మామిడి, బొప్పాయి, జామ, సపోటా, కూరగాయల పంటలకు మాత్రమే రాయితీ ఇచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం అల్లం, పసుపు, డ్రాగన్ ఫ్రూట్స్, పైనాపిల్ పంటలకూ రాయితీ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్ తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్స్ పంటకు హెక్టారుకు మూడు లక్షల 32 వేల రూపాయలు, పైనాపిల్ పంటకు హెక్టారుకు రూ.26,250, పసుపు పంటకు హెక్టారుకు రూ.12 వేలు, అల్లం పంట వేసే రైతులకు రూ.12 వేల రాయితీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్స్, పసుపు, అల్లం పంట వేసే రైతులు రాయితీ కోసం ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి