ఈ నెల 15 నుంచి సీఐటీయూ స్వర్ణోత్సవ 15వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగనున్నాయి. ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతూ భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని బోసుబొమ్మ సెంటర్ నుంచి ఏబీఎం కాంపౌండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. మహాసభలు ప్రారంభం రోజు నగరంలో 30వేల మంది కార్మికులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. ఈ బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌తోపాటు సీఐటీయు జాతీయ నేతలు పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి...బొబ్బిలి రహదారికి మోక్షమెప్పుడు..?