ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను నెల్లూరు సీపీఎస్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. అతని నుంచి 10 గ్రాముల బంగారం, ఒకటిన్నర కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.25 లక్షలు ఉంటుందని సీసీఎస్ సీఐ బాజీజాన్ సైదా తెలిపారు.
టి.పి.గూడూరు మండలం పాతకోడూరు చెందన శివ, శ్రీనివాసులు అనే అన్నదమ్ములు గత కొంత కాలంగా ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం గుడ్లూరులో నివాసముంటూ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు పదకొండు ఆలయాల్లో చోరీలు చేశారన్నారు. నిందితుడు శివను జలదంతకి మండలం వద్ద అరెస్ట్ చేశామని.. మరొకరి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: