ముఖ్యమంత్రి జగన్ పాలనలో దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య అన్నారు. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని చెప్పారు. ఈ మేరకు నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా తీరుపై మండిపడ్డారు.
కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాంట్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దళితులపై ఇంతటి నిర్లక్ష్యం వహించడం మంచి పద్ధతి కాదని.. సీఎం జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు వాగ్దానాలతో జగన్మోహన్ రెడ్డి గట్టెక్కారని.. పద్ధతి మారకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు దళితులు, మైనారీ, బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
jagan bail: 'జగన్ బెయిల్ రద్దు పిటిషన్'పై.. కీలక పరిణామం!