నెల్లూరు జిల్లాలో గోదాముల కొరత తీర్చాలని రైస్ మిల్లర్ల విజ్ఞప్తి నెల్లూరు జిల్లాలో దాదాపు 400 మిల్లులు ఉండగా వివిధ సమస్యలతో ఇప్పటికే పదుల సంఖ్యలో మూతపడ్డాయి(rice millers in Nellore district). జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో 8 లక్షలకుపైగా వరి సాగు చేస్తారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాల విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కొన్నాళ్లుగా ప్రభుత్వ విధానాలపై మిల్లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ నుంచి సహకారం అందట్లేదని ఆరోపిస్తున్నారు. రైతులకు గోనె సంచులు ఇచ్చే బాధ్యతనూ తమపైనే పెట్టారని.. ఒక్కోదానికి రూ. 35 ఖర్చు అయితే ప్రభుత్వం కేవలం రూ. 10 మాత్రమే ఇస్తోందని వాళ్లు వాపోతున్నారు(rice millers problems).వడ్లు ఆరబెట్టుకునేందుకు రైతులకు మండల స్థాయిలో కల్లాలు ఏర్పాటు చేస్తామని.. తూర్పారబట్టే యంత్రాలు ఇస్తామని అధికారులు మూడేళ్లుగా చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదని మిల్లర్లు అంటున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఆదుకోవాలని మిల్లర్లు(rice millers association appeal to reduce warehouse shortage) కోరుతున్నారు.
ఇదీ చదవండి: Distorted midday meals: వికటించిన మధ్యాహ్న భోజనం... 50 మంది చిన్నారులకు అస్వస్థత