ETV Bharat / state

'న్యాయం చేయండి.. లేకుంటే ఆత్మహత్యకు అనుమతివ్వండి..!' - undefined

భూ సమస్య పరిష్కరించకుంటే కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకుంటామంటూ.. 30 మంది నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. తమ భూమిలో కొంత భాగం అమ్మాలని స్థానిక భూస్వాములు దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/09-December-2019/5318662_120_5318662_1575891517389.png
Seven families protest at Nellore Collectorate
author img

By

Published : Dec 9, 2019, 5:39 PM IST

నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఏడు కుటుంబాల ఆందోళన

తమ భూ సమస్య పరిష్కరించాలని నెల్లూరు కలెక్టరేట్​ కార్యాలయం ఎదుట 7 కుటుంబాలకు చెందిన వ్యక్తులు పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆందోళనకు దిగారు. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన ఏడు కుటుంబాలకు ప్రభుత్వం 2003లో సంగం మండలం తరుణవాయి గ్రామం దగ్గర 12 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. ఈ భూమిలో 84 సెంట్లు అమ్మాలంటూ తమపై స్థానిక భూస్వాములు దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వారి దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా.. తిరిగి తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. 15 రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించి... సమస్యను పరిష్కరించకుంటే.. కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలన్నారు. అధికారులు పట్టించుకోకపోవటం వల్ల పిల్లలతో సహా దాదాపు 30 మంది కలెక్టర్ కార్యాలయానికి పురుగుమందు డబ్బాతో వచ్చి ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గమనించిన పోలీసులు వారి వద్ద పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకుని వారిని పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి:

'ప్రకాశం జిల్లా బోగస్​ పట్టాల ఘటనపై విచారణ నెల రోజులు వాయిదా'

Intro:Ap_Nlr_01_09_Atmahathya_Chesukuntam_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
భూ సమస్య పరిష్కరించకుంటే కుటుంబాలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డుతామంటూ కొందరు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బులతో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పురుగుమందుల డబ్బాను స్వాధీనం చేసుకొని వారిని స్టేషన్ కు తరలించారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఏడు కుటుంబాలకు 2003లో సంగం మండలం తరుణవాయి గ్రామం దగ్గర 12ఎకరాల భూమి పంపిణీ చేసింది. ఈ భూమిలో 84సెంట్లు అమ్మాలంటూ తమపై స్థానిక భూస్వాములు దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వారి దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా, తిరిగి తమపైనే కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని వారు వాపోయారు. 15 రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించి తమ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే తాము కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో పిల్లలతో సహా దాదాపు 20 మంది కలెక్టర్ కార్యాలయానికి పురుగు మందు డబ్బాతో వచ్చే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులు వారి వద్ద పురుగుమందు డబ్బాను స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించారు.
బైట్: వసంత్, బాధితుడు, బుచ్చిరెడ్డిపాలెం.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.