శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరులో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. నగరంలోని శబరి క్షేత్రంలో వేద పండితులు స్వామివారి కల్యాణ వేడుకను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. కరోనా తీవ్రత దృష్ట్యా స్వామివారి కల్యాణాన్ని ఏకాంతంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ కుటుంబ సభ్యులు, ఆలయ నిర్వాహకులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి