నెల్లూరు జిల్లా సోమశిల జలాశయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. సోమశిల జలాశయం నిండుకుండలా కనిపిస్తోన్న, ప్రాజెక్టు దగ్గర్లోని చెరువుల్లో నీరు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోమశిలకు వస్తున్న జలాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందారని ఆరోపించారు. జలాశయం వద్ద ఉండాల్సిన అధికార్లు, నెల్లూరులో ఉండి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయాల పేరుతో అధికార్లు విధులకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే, నాలుగు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని రామకృష్ణ ఆరోపించారు.
ఇవీ చదవండి